గత నెలలో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడిన సంగతి తెలిసిందే. యురేనియంతో కూడిన ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Gas Crisis: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో ఎనిమిది గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని సెమీ గవర్నమెంట్ నేచురల్ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశీయ వినియోగదారుల కష్టాలు పెరిగాయి.
First Hindu Woman In Pak To Become A Senior police officer: పాకిస్తాన్ వంటి ముస్లిం దేశంలో హిందువుల భవితే ప్రశ్నార్థకం అవుతోంది. ప్రస్తుతం పాక్ సమాజంలో హిందువులను చిన్నచూపు చూస్తుంటారు. ఒకప్పుడు గణనీయంగా ఉండే హిందువులు ప్రస్తుతం 2 శాతానికి పడిపోయారు. నిత్యం కిడ్నాపులు, మతమార్పిడిలు, పెళ్లిళ్లతో హిందువులను వేధిస్తుంటుంది అక్కడి సమాజం. అయితే ఓ హిందూ మహిళ మాత్రం పాకిస్తాన్ లో రికార్డ్ సృష్టించింది. పోలీస్ శాఖలో ఉన్నతంగా భావించే డిప్యూటీ…
పాకిస్తాన్ లో మైనారిటీల అణచివేత కొనసాగుతూనే ఉంది. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు, హిందూ అమ్మాయిలను అపహరించుకుని వెళ్లి పెళ్లిళ్లు చేసుకోవడం, అత్యాచారాలకు పాల్పడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో అక్కడ మైనారిటీ హిందువులకు చెందిన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. గతేడాది అక్టోబర్ నెలలో కొత్రిలోని సింధు నది ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తాజాగా బుధవారం రోజు పాక్ లో మరో…
గుజరాత్ సముద్ర తీరం…డ్రగ్స్ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా ? విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్…గుజరాత్ ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోందా ? కచ్ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. గుజరాత్ తీరం…డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిపోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఇటీవల కాలంలో వరుసగా…వందల కోట్ల విలువ చేసే…గంజాయి గుజరాత్ తీరం పట్టుబడింది. వారం రోజుల క్రితం 4వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కోస్ట్‌గార్డు పట్టుకుంది. ఈ కేసులో…
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. కరాచీలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్లలో 10 మంది మృతి చెందారు. భారీ పేలుడు ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Read: శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న సూపర్ స్ట్రెయిన్…ఆ రెండూ కలిస్తే… మృతుల సంఖ్య పెరిగే అవకాశం…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…