Pakistan: ఎయిర్‌పోర్టులో యురేనియం.. దీనిపై పాకిస్తాన్ ఏమందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: గత నెలలో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడిన సంగతి తెలిసిందే. యురేనియంతో కూడిన ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి వచ్చే విమానంలో ఈ ప్యాకేజీ లభించింది. అయితే తాజాగా పాకిస్తాన్ ఈ యురేనియం ప్యాకేజీ గురించి స్పందించింది. బ్రిటీష్ మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ ఇవాళ ఖండించింది. ఈ వార్త వాస్తవం కాదని కొట్టిపారేసింది. యూకే అధికారికంగా పాకిస్తాన్‌తో ఎటువంటి సమాచారం పంచుకోలేదని పాక్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నివేదికలు వాస్తవం కాదని తాము విశ్వసిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా తెలిపారు.
Delhi: ఆప్‌కు భారీ షాక్.. 10 రోజుల్లో రూ.163.62 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..
Also Read
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
డిసెంబర్ 29న సాయంత్రం వచ్చిన ఒమన్ ఎయిర్ ప్యాసింజర్ ఫ్లైట్ డబ్ల్యూవై 101 ద్వారా కార్గో ప్యాకేజీ హీత్రో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 4కి చేరిన సంగతి తెలిసిందే. స్క్రాప్ మెటల్ షిప్‌మెంట్‌లో యురేనియం దొరికింది. అణుపదార్థంగా యురేనియాన్ని వాడుతారు. అణ్వాస్త్రాలు, అణు విద్యుత్ ఫ్లాంట్లలో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. పాకిస్తాన్ నిఘా లేకపోవడం వల్లే ఇది వచ్చిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టుబడిన యురేనియం చిన్న మొత్తంలోనే ఉందని.. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణులు అంచనా వేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు యూకే పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?