Dawood Ibrahim: పాక్‌లో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సహకరించిన వ్యాపారికి ముంబైలోని ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. కరాచీలో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు దావూద్ ఇబ్రహీం ఆ వ్యక్తి సహాయాన్ని కోరాడు. ఈ కేసులో గుట్కా తయారీదారు జేఎం జోషితో పాటు మరో ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు
జేఎం జోషి, జమీరుద్దీన్ అన్సారీ, ఫరూఖ్ మన్సూరిలను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA), ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బీడీ షెల్కే దోషులుగా నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం జోషి, సహ నిందితుడు రసిక్లాల్ ధరివాల్ మధ్య ఆర్థిక వివాదం ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఇద్దరూ ఇబ్రహీం సహాయం కోరారు. వివాదాన్ని పరిష్కరించినందుకు ప్రతిఫలంగా, ఇబ్రహీం 2002లో కరాచీలో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి వారి సహాయాన్ని కోరాడు. ఈ కేసు విచారణ సమయంలో ధరివాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీం ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు.