Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
Pakistan Girl: పాకిస్థాన్ సమాజంలో మహిళలపై ఉన్న రూఢి సంస్కారాలు, వారి వస్త్రధారణ పట్ల చూపుతున్న అసహనం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి బలమైన ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోలో, ఓ ముస్లిం యువతి జీన్స్, టాప్ వేసుకుని కరాచీ వీధుల్లో స్వేచ్ఛగా నడుస్తూ కనిపించగా, ఆమె వైపు చూసే విధానం మానవత్వాన్ని తాకట్టు పెట్టినట్టే ఉంది. సాధారణంగా నగర వీధుల్లో నడవడం ఎవరికి అయినా సాధారణమే. కానీ…
పాకిస్తాన్‌లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు.
Pakistan: పాకిస్తాన్‌కి భారీ దెబ్బ తగిలింది. కరుడుగట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. మాలిర్ జైలు లోపల హింసాత్మక దాడి జరిగిన తర్వాత సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఖైదీలు పోలీస్ అధికారులతో ఘర్షణ పడిన తర్వాత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్లు రిపోర్టులు వస్తున్నాయి.…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…
India-Pakistan Conflict: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ లాహోర్‌తో పాటు ఇతర నగరాల్లో పేలుడు శబ్ధాలు వినిపించడంతో ఒక్కసారికి పాక్ ప్రజల్లో వణుకు పట్టింది. భారత్ మళ్లీ దాడి చేస్తుందా..? అనే అనుమానాలు పాక్ ప్రజలు వ్యక్తపరిచారు. అయితే, తాజాగా పాక్ ఆర్మీ మీడియా విభాగం ఐఎస్పీఆర్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పేలుళ్లకు భారత్ కారణమని ఆరోపించింది. తాము ఇండియాకు చెందిన 12…
Pakistan: రంజాన్ మాసంలో పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తులు భారత వ్యతిరేక ఉగ్రవాదులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. నిజానికి టెర్రరిస్టుల్ని చూస్తే ప్రజలు భయపడాలి కానీ, పాకిస్తాన్లో మాత్రం బయటకు వెళ్లాలంటే ఉగ్రవాదులు భయపడి చస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్చి చంపుతారో తెలియడం లేదు. గత కొన్నేళ్లుగా ఒకే విధంగా ఉగ్రవాదుల్ని అజ్ఞాత వ్యక్తులు టార్గెట్ చేసి చంపేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ భయాన్ని రుచి చూపిస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ నుంచి వచ్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. బయటకు వెళ్తే, తిరిగి ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అక్కడి ఉగ్రవాదుల్లో ఉన్నాయి. దీంతో కీలకమైన ఉగ్రవాదులు అండర్ గ్రౌండ్స్ వెళ్లారు. మరికొందరికి పాక్ ఐఎస్ఐ, ఇతర భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి.