Dawood Ibrahim: కరాచీ ఎయిర్‌పోర్టును ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్.. ఎన్ఐఏ సంచలన రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్ పోర్టును దావూద్ ఇబ్రహీం ఏలుతున్నాడని.. అక్కడ డీ-కంపెనీ మాఫియాకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్ఐఏ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్టులో వీరందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తేలింది.
Read Also: Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
కరాచీ ఎయిర్ పోర్టు కేంద్రంగా దావూద్ అక్రమదందా సాగుతోందని ఎన్ఐఏ తేల్చింది. ఎయిర్ పోర్టులో చెక్-ఇన్, చెక్-అవుట్ సమయంలో ప్రత్యేక అధికారుల ఉంటున్నాయని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దావూద్ తో పాటు ఛోటా షకీర్ ఉగ్రవాదులకు కరాచీ ఎయిర్ పోర్టులో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపింది. 1993 ముంబైలో వరసగా 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. అప్పటి నుంచి పాకిస్తాన్ లో రక్షణ పొందుతున్నాడు.
ఇదిలా ఉంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పఠాన్ కు చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ విచారణలో ఎన్ఐఏ అధికారులకు ఈ విషయం వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడనేది అబద్ధం అని వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో సహా పాకిస్థాన్‌లోని కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనుక రక్షణ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్య మైజాబిన్. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మొదటి కుమార్తె మారుఖ్ ను ప్రముఖ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. మరో కుమార్తెతో పాటు కుమారుడికి కూడా వివాహం అయింది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!