Hindu man abducted in pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హిందూ బాలికలు అపహరించి బలవంతంగా ముస్లీం వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసి మతం మారుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పాక్ లోని సింధ్ ప్రావిన్సుల్లో వందల సంఖ్యలో జరిగాయి.
పాకిస్థాన్ లోని కరాచీలో శుక్రవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. భాద్ ఘర్ లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్‌మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది.
ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్‌లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Al Badr Terrorist shot dead in Pakistan: భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతం అవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలంను ఇటీవల పాకిస్తాన్ రావల్పిండి నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాక్ లో కాల్చిచంపారు. ఇదిలా ఉంటే ఆదివారం మరో ఉగ్రవాది ఇలాగే హతమయ్యాడు. పాక్ ఉగ్రవాద సంస్థ అల్ బదర్ మాజీ…
పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు.
Pakistan Witnesses Major Power Breakdown: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాల్లో అంధకారం అలుముకుంది. ట్రాన్స్‌మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉదయం 7.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ ట్వీట్…
Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్…
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఈసారి పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సెప్టెంబర్ 2022లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ముందు హసీనా పార్కర్ (దావూద్ సోదరి) కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించాడు.