యూనివర్సల్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ…
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “విక్రమ్”. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై . ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ క్రిష్ గంగాధరన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు నటులు విజయ్ సేతుపతి,…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…
(అక్టోబర్ 2న ‘ఒకరాధ – ఇద్దరు కృష్ణులు’కు 35 ఏళ్ళు) ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలను పలుమార్లు సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఈ నేపథ్యంలో యండమూరి రాసిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ నవలను అదే టైటిల్ తో రూపొందించారు. శ్రీసారసా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన ‘ఒక రాధ – ఇద్దరు…
ఒకే రోజున ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలయితే అది అభిమానులకు పెద్ద విశేషమే! అలాగే ఒకే రోజున ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు కూడా పలుమార్లు విడుదలయ్యాయి. వాటినీ ముచ్చటించుకున్నాం. కానీ, ఒకే రోజున ఒకే దర్శకుని రెండు చిత్రాలు విడుదల కావడం వాటిలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకోవడం మరింత విశేషమే కదా! సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 అక్టోబర్ 2వ తేదీన ఆ ముచ్చట జరిగింది. ప్రముఖ…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ -2’, ‘విక్రమ్’ సినిమాలలో నటిస్తున్నారు. ఇందులో మొదటి సినిమాను శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంటే, రెండో సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాకు ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విశేషం ఏమంటే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అధినేతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తో పాటు తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్…
(ఆగస్టు 29తో ‘అమావాస్య చంద్రుడు’కు 40 ఏళ్ళు) విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన నూరవ చిత్రం ‘రాజా పార్వై’. నిర్మాతగా కమల్ కు ఇదే తొలి చిత్రం. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ పేరుతో అనువదించారు. తమిళ చిత్రం 1981 ఏప్రిల్ 10న విడుదల కాగా, తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’ ఆగస్టు 29న జనం ముందు నిలచింది. కమల్ హాసన్ ఆయన అన్నలు చారుహాసన్, చంద్రహాసన్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు…
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా…
“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…