సినీ తారల అభిమానానికి ఎల్లలు ఉండవంటారు. అది నిజమే… తమిళ నటుడు కమల్ హాసన్ అభిమాని, కేరళలోని కోజికోడ్ కు చెందిన నేహా ఫాతిమా ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ సరికొత్త ప్రపంచరికార్డ్ ను సృష్టించింది. చుక్కలు, గీతలు లేకుండా కేవలం కమల్ హసన్ పేరును మాత్రమే రాస్తూ, ఆయన పోర్ట్ రేట్ ను గీసింది. లారెస్ట్ స్టెన్సిల్ వర్డ్ ఆర్ట్ విభాగంలో పెన్ పెన్సిల్ తో వైట్ చార్ట్ పై రెండు గంటల యాభై…
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు…
‘దశావతారం’ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలో కమల్ పది పాత్రలు చేసి రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ‘నవరాత్రి’ సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రలు చేశాడు. తెలుగులోనూ ‘నవరాత్రి’ మూవీలో అక్కినేని తొమ్మిది పాత్రలు చేసి మెప్పించాడు. అయితే, కమల్ ‘దశావతారాల’తో తన దమ్మేంటో 13 ఏళ్ల కింద బాక్సాఫీస్ వద్ద నిరూపించాడు. 200 కోట్లతో అప్పట్లో ఆ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రజనీకాంత్ ‘శివాజీ’ రికార్డుల్ని బ్రేక్ చేసింది!‘దశావతారం’…
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’…
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపకల్పనకు పథక రచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మురుగదాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. దానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇద్దరికీ చెప్పాడని, వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నమాట. విశేషం ఏమంటే… ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబుస్పైడర్ చిత్రంలో నటించాడు. అది బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని…
తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. కమల్ హాసన్ పార్టీ ఒక్కచోట కూడా గెలుపొందలేక పోయింది. కమల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. లోకేశ్ కనకరాజ్ తో చేస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్’ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ‘తుగ్లక్ దర్బార్, 19(1)a, కడైసీ వ్యవసాయి, మామణిదన్, ముంబైకార్’ వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి కమల్ తో నటించటం కన్ ఫామ్ అట.…
కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.52 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. గత యేడాది కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ నర్మగర్భంగా సెలవిచ్చారు. ఇప్పుడు దానిని గుర్తు చేసి కొందరు ఆట పట్టిస్తుంటే, మరోపక్క కమల్ ను నమ్ముకుని పార్టీలోకి అడుగుపెట్టిన చాలామంది బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఐపీఎస్ అధికారి మౌర్యతో పాటు,…
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాల్లో ఇంతవరకు చూడని ఎన్నో వివాదాలు ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్’ కు ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను…
ఇండియన్ 2… సూపర్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇటీవల దర్శకుడుపై నిర్మాణ సంస్థ లీగల్ యాక్షన్ తో ఇక ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే న్యూస్ మరింతగా వ్యాప్తి చెందింది. అయితే తాజా సమాచారం మేరకు హీరో కమల్ హాసన్ ఇండియన్ 2 ని మళ్ళీ పట్టాలెక్కించే పనిలో…
(మే 9న ‘భారతీయుడు’కు 25 ఏళ్ళు) విలక్షణ నటుడు కమల్ హాసన్, డైనమిక్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ కలయికలో రూపొందిన ‘ఇండియన్’ చిత్రం తెలుగులో ‘భారతీయుడు’ గా అనువాదమై ఏకకాలంలో విడుదలయింది. 1996 మే 9న విడుదలైన ‘ఇండియన్’, ‘భారతీయుడు’ దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తెలుగునాట కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మరింత విజయం సాధించింది. ఆ చిత్రాల…