పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘ఆప్’ జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు…
ఈ వేసవిలో కమల్ హాసన్ బాక్సాఫీస్ రేసులో చేరబోతున్నాడు. ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ 2’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3’ వంటి పెద్ద సినిమాలు ఇప్పటికే ఏప్రిల్, మేలో విడుదలకు డేట్లను లాక్ చేశాయి. తాజాగా ‘విక్రమ్’ ఈ జాబితాలో చేరుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కార్తీ ‘ఖైదీ’, విజయ్ ‘మాస్టర్’ వంటి బ్లాక్బస్టర్లను అందించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.…
విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది. అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు…
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ “NBK 107” సినిమా…
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు. Read Also…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ లో కరోనా సోకడంతో ఆయన పది రోజులకు పైగానే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది. ఇక ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్…
ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ…
ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన అనేక మలయాళ చిత్రాలను తెరకెక్కించారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దర్శకుడు తన భార్య వల్సల సేతుమాధవన్, ముగ్గురు పిల్లలు సంతోష్, ఉమా మరియు సోను కుమార్లతో కలిసి ఉంటున్నారు. దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ సినిమాలకు చేసిన కృషికి గానూ 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర…