ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. కొవిడ్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ఆ ప్రకటనలో తెలిపారు.
కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం… మరిప్పుడు తమిళ బిగ్ బాస్ ను ఎవరు నిర్వహిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. మరి కమల్ హాసన్ ఈ ప్రశ్నకు ఎప్పుడు జవాబు చెబుతారో చూడాలి.
அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021