తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా సాగనున్నది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ లోపల.. బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వ బిల్లులపై చర్చ కొనసాగనున్నది. మొదట పంచాయతీ రాజ్.. మున్సిపల్ సవరణ బిల్లులు.. తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదిక పై చర్చ జరుగనుంది. “కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమీషన్ నివేదిక”…
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్... 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్‌కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా ? కేబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా…లోలోపల నేతలు భయపడుతున్నారా ? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా ? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు…కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా ? తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు దెబ్బతినడం…సుందిళ్ల బ్యారేజీలో సీపేజ్ సమస్యలు రావడాన్ని…
Kaleshwaram Commission Report: ఒకట్రెండు రోజుల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వంకు ఇవ్వనుంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి లేదా రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల…
Kaleshwaram Commission : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జస్టిస్ పీ.సీ. ఘోష్ నేతృత్వంలోని కమిషన్ తన నివేదికను రేపు (సోమవారం) ఉదయం ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదికతో పాటు, ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్‌రావ్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను కూడా రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ ఘోష్ నివేదిక అందిన తర్వాత, ఈ రెండు కమిషన్ల నివేదికలను మంత్రివర్గం ఆమోదించాల్సి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు…
కాళేశ్వరం కమిషన్ విచారణలో సరికొత్త ట్విస్ట్‌లు ఉండబోతున్నాయా? బీఆర్‌ఎస్ ముఖ్యులు ఇంకా ఇరుక్కుంటున్నారా? ఆ మంత్రి…. మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారా? కమిషన్‌కు ముగ్గురు ముఖ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ…. తన దగ్గరున్న ఆధారాలను కమిషన్ ముందు పెట్టారా? ఎవరా మంత్రి? ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణే హాట్ టాపిక్. బ్యారేజీ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది.…
కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర కమిషన్ రిపోర్ట్ వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని, ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కాలేశ్వరం విచారణలో ఎలాంటి రాజకీయ కక్ష వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే.. అందులో ఎవరి పాత్ర ఉంటే వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ…