ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీష్‌రావు భేటీ ముగిసింది.. సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపణలు చేశారు. జూన్ 5న కేసీఆర్, జూన్ 9న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై చర్చలు జరిపారు.
KCR-Harish Rao : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై…
MLC Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఖండిస్తూ ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. Read Also: IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..! ఈ సందర్బంగా ఆమె, ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కి రాజకీయ…
కాళేశ్వరం కమిషన్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31తో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ వర్గాలు ప్రకటించాయి. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. పీసీ ఘోష్ కమిషన్ పదవీ కాలం పెంపుతో…
పోసానికి తృటిలో తప్పిన ప్రమాదం! సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె…
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిల విచారణ ముగిసింది. ముగ్గురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోపెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని… నిజాలను చెరిపి వేయొద్దని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లను దాచారని కమిషన్ కామెంట్ చేసింది. డిజైన్స్, డీపీఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. అన్నారం, సుందిళ్ల, లొకేషన్ మార్పు…
Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వ్యక్తుల్లో కొందరిని మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ విచారణలో ముఖ్యంగా అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లు, విచారణలో చెప్పిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. అందువల్ల, నిజమైన అంశాలను వెలికితీయడానికి ఈ దర్యాప్తును మరింతగా క్షుణ్ణంగా నిర్వహించనున్నట్లు సమాచారం. Read Also: Telugu Language:…
కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను సంస్థ విచారించింది. అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది..
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణకు హాజరు కావాలంటూ రామకృష్ణారావుకు కాళేశ్వరం కమిషన్ సోమవారం సమన్లు పంపింది.