Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టులో హాట్ హాట్గా కొనసాగుతున్న వాదనలు..
- కాళేశ్వరం కమిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ..
- కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు..
- కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్..
- కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు: లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ హాట్ హాట్ గా కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని న్యాయస్థానంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ తరపు లాయర్ వాదిస్తూ.. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని ఆరోపంచారు. కేసీఆర్ అడిగినా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
అలాగే, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవన్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారని లాయర్ తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.. 60 పేజీల కమిషన్ రిపోర్టును మీడియా ప్రతినిధులకు అందజేశారని చెప్పుకొచ్చారు. అనంతరం.. హైకోర్టు బెంచ్ స్పందిస్తూ.. తమకు సమర్పించిన కాళేశ్వరం కాపీ సక్రమంగా లేదని పేర్కొనింది. రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై బెంచ్ కు హరీష్ రావు తరపు లాయర్ ఆర్యమ సుందరం క్షమాపణ చెప్పారు.
Read Also: Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
మరోవైపు, కాళేశ్వరం కమీషన్ రిపోర్టుపై విచారణను హైకోర్టు మధ్యాహ్ననికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిశీలించే కమిషన్ విచారణ చేసింది.. చర్యలు తీసుకునే అంశంపై కమిషన్ ఎలాంటి సిఫార్సు చేయలేదు.. అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పడం సబబే.. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వ్యూలు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!