కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ క్రమంలోనే నేడు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన DEE -AEE లను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ విచారించించారు.
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణ నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. నేడు (సోమవారం) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ 14 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది.
ఈరోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వెంకటేశ్వర్లను రెండు విడతలుగా విచారించింది కమిషన్. రేపు మళ్లీ విచారణకు రావాలని వెంకటేశ్వర్లను కమిషన్ ఆదేశించింది. బహిరంగ విచారణలో వెంకటేశ్వర్లు మాజీ ముఖ్యమంత్రి పేరును పలుసార్లు ప్రస్తావించారు.
రేపటి నుంచి పలువురు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ ను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉంది.
పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి.. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు రానుందని తెలిపారు. హైడ్రా బాధితులంతా తమ కుటుంబ…
గజ్వేల్ ENC హరిరామ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. కమిషన్ చీఫ్ 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ENC హరిరామ్ దాటవేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందు ENC హరిరామ్ హాజరుకానున్నారు. ఇవ్వాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని హరిరామ్ చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లకు 29వేల 737 కోట్లు రీ…