కాకినాడ సినిమా రోడ్డులో చోరీ ఘటన చోటుచేసుకుంది. చందాకి వచ్చి మత్తు మందు చల్లి 50 గ్రాములు బంగారం చోరీకి పాల్పడ్డారు కేటుగాడు.. మంజు శ్రీ అనే మహిళ భర్త బయటకు వెళ్లగా, పిల్లలు సెలవులకు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు కాకినాడ కస్టమ్స్ అధికారులు.. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా.. పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.
కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పేరుతో సైబర్ మోసం చేసే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు.. 88819 42520 నెంబర్ కి కలెక్టర్ ఫొటోను డీపీగా పెట్టిన కేటుగాళ్లు.. కాకినాడ జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మార్వోలకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు.. తాను అత్యవసర మీటింగ్ లో ఉన్నానని.. డబ్బులు తిరిగి రెండు రోజుల్లో రిటర్న్ చేస్తానని మెసేజ్‌లు పెట్టిన కేటుగాళ్లు.
Pantham Nanaji: కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు.. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం స్టార్ట్ అయింది.
సాధారణంగా ఏ ఆపరేషన్ జరిగినా.. పేషెంట్‌కు వైద్యులు అనస్థీషియా (మత్తుమందు) ఇస్తారు. అనస్థీషియా నొప్పిని తెలియకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా.. సినిమాలోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ తన చేతులతో ట్యాబ్ పట్టుకుని కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని తొలగించారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి…
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఇమిటేట్ చేశారు.
అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..
ఒక యువకుడు చేతిలో కొండచిలువను పట్టుకుని వీధిలో డ్యాన్స్ చేసుకుంటూ విన్యాసాలు చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది. వీరు జాతరలో కొండచిలువలను ఆడించే వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ.. కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.