Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్కు ఎమ్మెల్యే నానాజీ క్షమాపణలు
- వైద్య విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ..
- రంగనాయ మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ కు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే నానాజీ..
- ఎమ్మెల్యేని తీసుకువచ్చి క్షమాపణలు చెప్పించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pantham Nanaji: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు. కేసు నమోదు చేయొద్దని కూడా నేను అడగడం లేదన్నారు. నేను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.
Read Also: Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
కాగా, దాడికి గురైన డాక్టర్ ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ.. కేసు పెడుతున్నామని చెప్పారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని స్టూడెంట్స్ కు సూచించారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. ముందుగా నేరస్థులను గుర్తించాలి అని అన్నారు. నాతో పాటు దెబ్బలు తిన్న విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. ఎమ్మెల్యే మీద నాకు కోపం లేదు.. కానీ పది మంది మధ్య చేసిన పని బాలేదని వైస్ చైర్మన్ విచారం వ్యక్తం చేశారు.
Read Also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..
అయితే, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డాక్టర్లు ఆందోళనకి సిద్ధమవుతున్నారు. జీజీహెచ్ దగ్గర నిరసన తెలుపనున్నారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీని కలిసి ఈ సంఘటనపై వైద్యులు ఫిర్యాదు చేయనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయంలో డాక్టర్ ను బూతులు తిట్టి, మాస్క్ లాగేసిన ఎమ్మెల్యే నానాజీ.. జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో డాక్టర్ కి పంతం నానాజీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!