Crime News: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. కత్తుల దాడిలో ముగ్గురు మృతి!
- కాకినాడ జిల్లాలో దారుణం
- రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
- కత్తుల దాడిలో ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు.
శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం విచక్షణరహితంగా కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో బత్తుల రమేశ్, బత్తుల చిన్ని, బత్తుల రాజులు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటనా స్థలంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్తో పల్లా, నిమ్మల భేటీ
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
శలపాక గ్రామంలో తదుపరి ఘర్షణలు జరగకుండా కాకినాడ సర్కిల్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఏర్పాట్లు చేశారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కాకినాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంఘటనా స్థలంకు వద్దకు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శలపాక గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!