గంజాయి సరఫరా చేసే వారికి కాకినాడ గేట్ వే గా మారింది.. నిత్యం జిల్లాలో ఏదో మూల గంజాయి మత్తు పదార్థాలు దొరుకుతూనే ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం అన్ని రకాల రవాణా అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. గంజాయి తాగేవాళ్ళు ఎక్కువయ్యారని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడి మండలం…
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా-KUDA) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి అధికంగా స్టేజ్పైకి జనం చేరడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకటరమణ కృష్ణవరంగా గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. వివాహిత పట్ల వెంకటరమణ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం
గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు.
ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక…