ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు..
పెళ్లిపేరుతో మోసం చేసిన ఓ ముఠాపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. బాధితుడినే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది నకిలీ పెళ్లికూతురు. ఫోన్ చేసి వేధించాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ పెళ్లి పేరుతో మోసం ఎలా జరిగిందంటే.
100 Variety Foods: ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటికి వచ్చిన అల్లుడికి పెద్ద ఎత్తున అత్తమామలు మర్యాదలు చేయడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇంటికి అల్లుడు వస్తున్నాడు అంటే చాలు.. అనేక ఏర్పాట్లను రెడీ చేసి అల్లుడికి రాచ మర్యాదలు ఎక్కువగా చూస్తుంటారు. కాకినాడలో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తమామలు 100 రకాల పిండి వంటలను చేసి వడ్డించారు. ఇక ఈ విషయం సంబంధించి…
పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు స్పష్టీకరణ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది.
కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో.. కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంగా వారాహి మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా.. ఇదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.