గత పది రోజులుగా పీడీఎస్ రైస్ ఎక్కువ మూమెంట్ అవుతుందని ఎందుకు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జేసీ రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు.
Thief Snatches Hundi in Kakinada: కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ, ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినా దృశ్యాలు. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భక్తుడుల వచ్చి హుండీని కాచేసాడు…
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు.
తూర్పుమధ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుంది. ఉత్తరంవైపుగా కదులుతూ రేపు(ఆదివారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు.. కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ధర్నాకు దిగారు. దాదాపు వంద కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక నేతలు కొట్టేశారని మండిపడ్డారు కొండెవరం గ్రామస్తులు.
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు.