కాకినాడ సినిమా రోడ్డులో చోరీ ఘటన చోటుచేసుకుంది. చందాకి వచ్చి మత్తు మందు చల్లి 50 గ్రాములు బంగారం చోరీకి పాల్పడ్డారు కేటుగాడు.. మంజు శ్రీ అనే మహిళ భర్త బయటకు వెళ్లగా, పిల్లలు సెలవులకు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. స్వచ్ఛంద సేవకి చందాకి వచ్చిన ఒక వ్యక్తి, మంజు శ్రీ లేవని చెప్పడంతో దాహం ఉందని మంచి నీళ్ళు అడిగాడు. మంచి నీళ్ళు తెచ్చేలోపు మంజు శ్రీ పై మత్తు మందు చల్లి, ఆమె పడిపోవడంతో దొంగతనానికి పాల్పడ్డాడు. 50 గ్రాములు బంగారం, 500 గ్రాములు వెండి, నగదు పోయినట్లు ఫిర్యాదు చేసింది బాధితురాలు.. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో ఆ ప్రాతంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
READ MORE: Coriander benefits: కొత్తిమీరతో బీపీ, డయాబెటిస్ కంట్రోల్!
నిందితుడు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నాడని.. సేవ పేరుతో తలుపుతడతాడని… మత్తు మందు చల్లి ఉన్నదంతా ఉడాయిస్తాడని.. కాకినాడ మూడో పట్టణ ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. అందరూ జాగ్రత్తలు వ స్థానిక సినిమారోడ్డు, నెల్లిఅప్పన్న సెంటర్‌లోని ఓ బహుళ అంతస్తు భవనంలో పోతుల నాగేశ్వరరావు, భార్య మంజశ్రీ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
READ MORE:Kolkata: కోల్‌కతా దుర్గాపూజా మండపంపై ముస్లింగుంపు దాడి.. విగ్రహాలు ధ్వంసం చేస్తామని బెదిరింపు..