పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.
YS Avinash Reddy: తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు.. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు.. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
Yuva Galam Padayatra Book: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు మంత్రి నారా లోకేష్.
కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామాండ్.. కార్యకర్తె నా సుప్రీం అని స్పష్టం చేశారు.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం... ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు…
మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ... ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది... ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది... అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం..
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు.
కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి…
Penukonda: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా జరుగనుంది. ఈ మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో పెనుకొండ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఈ సైకిల్ యాత్రను మంత్రి సవిత శ్రీమతి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఆమె స్వయంగా సైకిల్ తొక్కుతూ 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ మొత్తం కార్యకర్తలు ఈ సైకిల్…
కడపలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్‌లోనే మృతిచెందారు.. కడప గువ్వల చెరువు ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో.. ఒక్కసారిగా కారుపై పడిపోయింది లారీ.. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు..