ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య పండు వెన్నెలలో రాముల వారి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి వైఎస్సార్ జిల్లా యంత్రాగం, టీటీడీ కలిసి సర్వం సిద్ధం చేశాయి. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సీతారాముల కల్యాణాన్ని లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి…
EX MLA Rachamallu: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ జరుగుతోంది.. అయితే, విచారణ పేరుతో మా కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మావతి.. కడప జిల్లా పులివెందులలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన పద్మావతి.. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై పోలీసులు మళ్లీ మా కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.. విచారణ పేరుతో మా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు.. కేసు విషయం పోలీసులు పొద్దుటూరు, బెంగళూరులో కలిశారని తెలిపారు..
ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ వారు కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఉమ్మడి కడప జిల్లాలోని 50 జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు..
POCSO Case: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. సహచర బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఆ బాలికల వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నెంబర్లను ఇతర విద్యార్థులకు ఇచ్చి వేధించాడు సదరు విద్యార్థి.
Kadapa ZP Chairman: నేడు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు అనంతరం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చైర్మన్ ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కడప మేయర్ సురేష్‌బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్.. 2023 - 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు..
Kadapa ZP Chairman: కడప జడ్పీ చైర్మన్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈనెల 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ జడ్పీ చైర్మన్ స్థానాన్ని కాపాడుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు.. వైసీపీ అధిష్టానం…