ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు చర్చాంశనీయంగా మారింది. అయితే మొదట ఈ ముందుకు బ్రేక్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్నటి నుండి మందు పంపిణి ప్రారంభించారు. అయితే తాజాగా కడపలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీకి బ్రేక్ పడింది. వనమూలికలు, తేనే, ముడి సరుకు నిర్వాహకులు సిద్దం చేసుకున్నారు. అయిన ఆనందయ్య శిష్యులు నేడు రాకపోవడంతో మందుల తయారీ, పంపిణీ వాయిదా వేసినట్లు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పైగా కేసులు వస్తుండగా 100 మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాధలయ్యారు. ఇక వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కడప జిల్లా వ్యాప్తంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన అనాధలైన పిల్లలను గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 142 మంది పిల్లలను గుర్తించినట్లు ICDS…
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు…వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు..…
మాములు రోజుల్లో ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుంటున్న నేపథ్యంలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నా, మరణాల రేటు పెరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయవాడ, కడప జిల్లాల్లో పరిస్థితులు దారుణంగాఉన్నాయి . మాస్క్…