నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం జరిగే ఈ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే.. బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత ఆరు నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. ఆరు నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే.. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్య అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం…
కువైట్ నుంచి వచ్చాడు అల్లుడ్ని హతమార్చాడు ఓ వ్యక్తి.. తన కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని వేట కొడవలితో విచక్షణ రహితంగా హత్య చేశాడు మహబూబ్ భాషా అనే వ్యక్తి... కడప నగరంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న చాంద్ బాషా అనే వ్యక్తిని ఓ విందు కార్యక్రమంలో ఉండగా అక్కడి నుండి కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసిన మామమహబూబ్ బాషా.. తన ఇంట్లో, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వేట కొడవలితో అతి దారుణంగా…
నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానం పెనుభూతమై భార్యలను అంతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తె ఆమె పాలిట కాలయముడిగా మారారు. అనుమానం పెనుభూతంగా మారి ఆ పచ్చని కుటుంబంలో చిచ్చు లేపింది. చెన్నూరు మండలం కొత్త గాంధీ నగర్ లో భార్యపై అనుమానంతో, భర్త ఆమెను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. Also…
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
TDP Mahanadu: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించిందదని, రాయలసీమకు చెందిన 24 నియోజకవర్గాల నుండి వచ్చిన నాలుగు లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణుల ఉత్సాహభరితంగా పాల్గొనడం ఈ విజయానికి నిదర్శనమని, ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో…
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది..
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.
ప్రపంచంలో చాలా అందమైన ప్రాంతాలను చూశానని.. ఇలాంటి శత్రు దుర్భేద్యమైన కోట, లోయ ఎక్కడా లేవని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడున్న విశాలమైన కొండలు, లోయలు చూస్తుంటే తన మనసు పులకించిందన్నారు. గండికోట ప్రాంతంలో త్వరలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గండికోటను మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదు అని పెమ్మసాని విమర్శించారు. నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి…
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల…