TDP Mahanadu Public Meeting: రేపే టీడీపీ భారీ బహిరంగ సభ.. నేతలకు టార్గెట్..
- మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ..
- కడపలో సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ..
- జన సమీకరణ చేయడానికి నేతలకు టార్గెట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu Public Meeting: ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట.. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా పది స్థానాలకు గాను ఏడు స్థానాలను దక్కించుకుంది కూటమి… దీంతో జోష్ లో ఉన్న టీడీపీ కడపలో మహానాడు నిర్వహణకు సిద్ధమైంది… మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ… ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది… ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది… అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం.. ఒక్కొక్క నియోజకవర్గం నుండి 30 వేల మందిని సమీకరించాలని భావిస్తుందట.. అందుకోసం తగిన ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత టీడీపీ నేతలకు ఆదేశాలు అందాయట… ఒక్కొక్క నియోజకవర్గం నుండి 30 వేల మందిని తరలించడానికి కావలసిన కావలసిన వాహనాల కోసం నేతలు పరుగులు తీస్తున్నారట… అటు ఆర్టీసీ ఇటు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారట…
Read Also: U16 Davis Cup: ఓడినా సిగ్గు లేదుగా.. ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ ప్లేయర్..!
Also Read
టిడిపి పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో జరుగుతున్న మహానాడు ను ఎలాగైనా విజయవంతం చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు భావిస్తున్నారట… అయితే ప్రస్తుతం ఉన్న వాహనాలు ఎటు సరిపోవడం లేదట… దీనికోసం అటు చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉన్న స్కూల్ బస్సులతో సహా ఏమి దొరికితే వాటిని తెప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారట… మహానాడు జరుగుతున్న కమలాపురం నియోజకవర్గంలో 70 వేల మందిని సమీకరించడానికి ఎమ్మెల్యే పుట్టా కృష్ణ చైతన్య రెడ్డి పూనుకున్నారట… కడప నగరానికి అతి సమీపంలో మహానాడు నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవికి అదే స్థాయిలో టార్గెట్ విధించారట. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మినిమం 20 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధిష్టానం సూచించింది… మహానాడు ప్రారంభానికి ముందు మంత్రులు ఎమ్మెల్యేలు ఉమ్మడి కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కీలక నేతలతో సమావేశం నిర్వహించారు… ఎవరెవరికి ఎన్ని బస్సులు లారీలు కావాలి. వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న వాటిపై చర్చించారట.. ఉమ్మడి కడప జిల్లా నుంచి రెండు లక్షల మందిని సమకూర్చితే మిగిలిన రాష్ట్రంలోని జిల్లాల నుంచి మూడు లక్షల మందిని తరలించారు వ్యూహరచన చేస్తోందట టిడిపి…. టిడిపి ఆశయానికి అటు వర్షం ఇటు వాహనాల సమస్య ఎంత మేరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిందే…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!