Road Accident: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్ మూడవ మలుపు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి బద్వేలు కు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది.కారును తప్పించపోయి ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్రీకాంత్,శిరీష్, హర్షిణి ,రిషి గా పోలీసులు తెలిపారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించారు. . మొత్తం 7 మంది కారులో ఉన్నట్లు తెలుస్తోంది . ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు బద్వేల్ మండలం చిన్నపుత్తాయ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు… రామాలయం ఓపెనింగ్ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు కోసం బెంగళూరు నుంచి శ్రీకాంత్ తన సొంత వాహనంలో బద్వేల్ బయలుదేరారు. అయితే గువ్వలచెరువు ఘాట్ రోడ్ లోకి రాగానే లారీ కారు కిందపడి ప్రమాదానికి గురైంది…
Read Also: Corona New Variant: గుబులు రేపుతోన్న కరోనా కొత్త వేరియంట్..! మరోసారి కష్టాలు తప్పవా?