వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మహానాడు నిర్వహణకు పనులు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికి ఏడు స్థానాల్లో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ద మవుతోంది టీడీపీ.. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా ? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి ? అనేది ఇప్పుడు చర్చగా మారింది..
టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదలైన కుర్చీ గోల.. ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించిందా? ఎమ్మెల్యే మేయర్ ను టార్గెట్ చేస్తూ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడం... ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ముప్పు తెచ్చి పెట్టిందా ? ఇప్పుడు కడప మేయర్‌పై వేటుతో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి..
కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబుపై అనర్హత వేటు వేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది..
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.
కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించాడని కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం! మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో…
కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.
కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొప్పర్తి పారిశ్రామిక వాడను పరిశీలించారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎం.ఎస్.ఎం పార్క్‌పై అపోహలు వద్దు.. జిల్లాలోని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాలు ఐటీ పార్క్ కోసం స్థల…
కడప జిల్లా లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు 14 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోందని, ఒక ఎకరా అరటి సాగుకు రైతుకు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఖర్చవుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.14,000 నేలకొరిగిన అరటి చెట్లు తొలగించడానికి అయ్యే కూలీలకు కూడా సరిపోదన్నారు.…
ఒంటిమిట్టలో సీతారాముల కల్యా ణోత్సవం సందర్భంగా నేటి ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు కడప మీదుగా వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు అలంఖాన్ పల్లె సమీపంలోని ఇర్కాన్, ఊటుకూరు కూడళ్ల మీదుగా రాయచోటికి వెళ్లి అక్కడ నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి కడప వైపు వచ్చే వాహనాలు రాయచోటి మీదుగా రావాల్సి ఉంటుంది. రాజంపేట వైపు నుంచి…