YS Avinash Reddy: తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు.. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు.. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు.. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారింటీ పేరు హామీలు ఇచ్చారు.. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు.. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు.. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైందని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Siddaramaiah: కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
ఇక, కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి.. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల చుట్టు జెండాలు, తోరణాలు కట్టి.. ప్రజల మనోబావాలు దెబ్బ తీశారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్ఆర్.. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది.. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మేం కక్ష సాధింపు రాజకీయం చేసుంటే.. మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది అన్నారు. రాజశేఖరరెడ్డిని అగౌరవ పరుస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపామని వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
అయితే, మేము ఎన్టీఆర్ ను ఏనాడు అగౌరవపరచలేదు అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి..
పులివెందులలో వైఎస్ విగ్రహాల చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం.. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు.. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలియజేసిన స్పందించలేదు అన్నారు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని అగౌరవపరచే విధంగా తోరణాలు కట్టారిన అవినాష్ రెడ్డి మండిపడ్డారు.