TDP Mahanadu: తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు… ఏపీలో ఏడాది పాలనపై మహానాడు వేదికగా 14 ముసాయిదా తీర్మానాలకు రూపకల్పన చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన ఘన విజయాలు… సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు తీర్మానాలు ప్రవేశపెడ్తారు.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొత్త ఫోటోలు.. త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణ..
మహిళ, యువత సంక్షేమానికి పెద్ద పీట … సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం… మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా తీర్మానాలు ప్రవేశపెడ్తారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు.. ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి కేంద్రీకరణ ఈ అంశాలు అన్నిటి మీద కూడా ప్రధానంగా తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో ప్రధానంగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి చర్చ జరుగనుంది. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతిపై మొదటి రోజు చర్చిస్తారు. శాంతి భద్రతలు, మహిళ యువత సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారు. ఇక, రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. తర్వాత తెలంగాణకు సంబంధించి తీర్మానాలు ఉంటాయి. ఆ రోజు పి 4 పై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడ్తారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. లోకేష్‌కు కీలక పదవికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
Read Also: Tamannaah : తమన్నాను తీసుకోవడం కరెక్ట్ కాదు.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్..
ఈ నెల 29న మూడో రోజు మహానాడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 450 మంది అతిథులు ఒకే వేదిక మీద కూర్చునేలా బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు. మహానాడులో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే కడప గడపపై ప్రతి చోట పసుపు జెండా రెపరెపలాడుతోంది. ఎక్కడ చూసినా పసుపు మయమే. మొదటిరోజు 23 వేల మంది ప్రజాప్రతినిధులకు, అదనంగా మరో ఏడు వేల మందికి కలిపి మొత్తం 30 వేల మందికి ఆహ్వానాలు పంపించారు. రెండో రోజు సుమారు రెండు లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. మూడవరోజు ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ నుంచి ఎక్కువగా టీడీపీ శ్రేణులు తరలివస్తాయని అంచనా వేస్తున్నారు. మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు మూడు రోజులు పాటు కడపలోనే బస చేస్తారు. ప్రత్యేక బస్సులో బస చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు..ఎమ్మెల్యేలు..మంత్రులు.. కడప చేరుకున్నారు.