Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది.
Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తాలిబన్‌లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి.
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Pakistan: భారత్‌లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్‌కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పాటు పాక్, ఆఫ్ఘన్ల మధ్య ఎప్పటి నుంచి సరిహద్దు వివాదం ‘‘డ్యూరాండ్ రేఖ’’తో ముడిపడి ఉంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఆగస్టు 2021లో ఆఫ్ఘన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ఒక తాలిబాన్ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య జరిగే మొదటి ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడం గమనార్హం.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Beauty Salons: దేశవ్యాప్తంగా బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ ఆదేశించడంతో డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ మహిళలు బుధవారం నిరసన తెలిపారు. భద్రతా బలగాలు వాటర్ గన్నులను ఉపయోగించాయి.
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న సొరంగమార్గంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా.. 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం.