వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అంతర్జాతీయంగా తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపులేకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్‌లో దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో అమెరికా నిధులను నిలిపివేసింది. అయితే, మానవతా దృక్పధంతో ఇండియా వంటి దేశాలు ప్రజలు శీతాకాలంలో ఇబ్బందులు పడకూడదని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను, మందులను సరఫరా చేస్తున్నది. Read:…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. ఆ దేశంలో ఉగ్రవాద శక్తులు బలం పుంజుకొని సాధారణప్రజలపై దాడులు చేస్తున్నారు. కొన్ని తెగల ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ రాజధానిలో వరసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జరిగింది. Read: ఈజిప్ట్‌లో బయటపడిన సూర్యదేవాలయం… ఏ కాలానికి చెందినదో తెలుసా… ఉదయం జరిగిన పేలుడు సంఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరోచోట బాంబు పేలుడు జరిగింది.…
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం జరిగిన పేలుడులో కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమ కాబూల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ 5లో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. ఈ పేలుడుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన దుకాణదారుడు అహ్మద్ ముర్తాజా వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, తాను కస్టమర్‌తో బిజీగా ఉన్నానని, “తన స్టోర్‌ను కదిలించిందని చెప్పాడు”. పేలుడు జరిగిన…
ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్లపాటు సేవలు అందించిన అమెరికా దళాలు అగస్ట్ 30 వ తేదీ వరకు పూర్తిగాఖాళీ చేసి వెళ్లిపోయాయి. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేని వ్యక్తులు ఆ దేశాన్ని వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు. అమెరికా దళాలు వెళ్లే సమయంలోచాలా మందిని శరణార్థులను విదేశాలకు తరలించింది అమెరికన్ సైన్యం. కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్ వద్ద లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారిని అమెరికా సైనికుడు అందుకొని లోపలికి తరలించాడు. ఓ గంట…
ఆప్ఘాన్ తాలిబాన్‌ల వశం అయినప్పటి నుంచి అక్కడ జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడి ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాబూల్‌లోని మిలటరీ ఆసుపత్రి సమీపంలోమంగళవారం భారీ పేలుడు శబ్దంతో పాటు కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుళ్ల ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి తాలిబాన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ పేళ్లులు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యి నెల రోజులైంది. ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు. దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు. ఇక ఉదిలా ఉంటే, తాలిబన్లు మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి…
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. తాలిబన్ అగ్రనేతలు అఖుండ్ జాదా, బరదర్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మార్పులు జరిగాయి. తాలిబన్ల కంటే ప్రభుత్వంలో హుక్కాని గ్రూప్ లకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు హుక్కాని గ్రూప్ కు, తాలిబన్లకు మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద రగడ జరిగిందని, ఈ రగడలో హైబతుల్లా అఖుండ్ జాదా మృతి చెందారని, బరదర్ ను బందీగా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు…