Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Read Also: Delhi: “స్నేహం” కోసం 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్..
పేలుడు సమాచారం అందిన వెంటనే భద్రత బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలోని స్పోర్ట్స్ క్లబ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఆ పేలుడులో నలుగురు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు.
2021లో పౌర ప్రభుత్వం నుంచి పాలనను దించేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘన్‌లో మైనారిటీలైన హజారా, షియా కమ్యూనిటీలను టార్గెట్ చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబాన్లకు తలనొప్పిగా మారారు.