ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబూల్ మేయర్‌గా హమ్దుల్లా నమోనీ నియమితులయ్యారు. కాగా, నమోనీ మహిళా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ విభాగాల్లో పనిచేసే మహిళలు మినహా మిగతా మహిళలు ఎవరూ కూడా ఉద్యోగాలకు హాజరుకావొద్దని ఆదేశాలు జారీచేశారు. మహిళలు ఇంటిపట్టునే ఉండాలని, బయటకు రావొద్ధని ఆదేశాలు జారీచేశారు. కాబూల్ నగరపాలక సంస్థలో మొత్తం 3 వేల మంది ఉద్యోగులు ఉండగా అందులో వెయ్యిమంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.…
తాలిబన్లు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందరికి సమానమైన గుర్తింపు ఇస్తామని, ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతామని చెప్పిన తాలిబన్లు దానికి విరుద్ధంగా చేశారు. ఒక్క మహిళకు కూడా మంత్రి వర్గంలో స్థానం ఇవ్వలేదు. పైగా మహిళలు ఇంటికే పరిమితం కావాలని, రాజకీయాల్లోకి వారి అవసరం లేదని చెప్పకనే చెప్పారు. బాలికల చదువుకు 1-5 తరగతుల వరకు మాత్రమే అనుమతించారు. దీంతో మహిళల పట్ల తాలిబన్లకు ఎలాంటి దృష్టి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. చాలా దేశాలు ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అందించే నిధులు చాలా వరకు ఆగిపోయాయి. తాజాగా ఆ దేశంతో అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ సంబంధాలను తాత్కాలికంగా తెంచుకుంది. అంతర్జాతీయ సమాజం గుర్తింపు లేకపోవడంతో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి నిధులు అందించలేమని ఐఎంఎఫ్ సంస్థ తెలియజేసింది. దీంతో ఆఫ్ఘన్ దేశానికి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచకాలు మొదలయ్యాయి. నడిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయడం మొదలుపెట్టారు. రాజధాని కాబూల్‌లో భారత వ్యాపారి బన్సరీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బన్సరీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఓ కారులో వచ్చిన దుండగులు బన్సరీలాల్ కారును ఢీకొట్టారు. అనంతరం వ్యాపారిని, ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అయితే, సిబ్బంది తప్పించుకొని…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తాలిబన్ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటు కూర్పు నచ్చకనే ఆ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ముల్లా బరాదర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ముల్లా మహమ్మద్ హసన్ ప్రధాని అయ్యారు. అదే విధంగా, ప్రభుత్వంలో హుక్కానీలకు పెద్దపీట వేస్తూ పదవులు అప్పగించారు. గతంలో దోహాలో జరిగిన సమావేశంలో తాలిబన్లు…
ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇప్పుడు తాలిబన్ల వశం అయింది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పూర్తిస్తాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచదేశాల గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకుంటే ఆఫ్ఘన్ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు కొన్నిదేశాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోని మాజీనేతల…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వ తేదీనుంచి ఆగస్టు 30 వ తేదీ వరకు అమెరికన్ ఆర్మీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఆగస్టు 31 నుంచి తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి కమర్షియల్ విమానాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాలేదు. కాగా, ఈరోజు ఉదయం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఇందులో 10 మంది వరకు ప్రయాణికులు…
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నాక కాబూల్‌లోని ప్రెసిడెంట్ భవనంలో తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ప్రెసిడెండ్ భవనంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఖరీదైన తివాచీలపై కూర్చోని ఇష్టం వచ్చినవి వండించుకొని తింటున్నారు. దీనికి సంబందించిన దృశ్యాలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రెసిడెంట్ భవనంతో పాటుగా ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తోమ్ ఇంటిని కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దోస్తోమ్ తాలిబన్లకు బద్ధశతృవు. పారాట్రాపర్‌గా, కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా…
అగ్రరాజ్యం అమెరికా ‘సెప్టెంబర్ 11’ రోజును కలలో కూడా మర్చిపోలేదు. ఈరోజునే అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించి అమెరికాకు సానుభూతి తెలిపాయి. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకు అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారిదంటూ ఆ దేశంపై దాడి చేసి వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈక్రమంలోనే నాటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా నామరూపల్లేకుండా…
తాలిబన్లు ఎలాంటి వారో అందరికీ తెలుసు. తాలిబన్లు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అనే విషయం అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అందరిని సమానంగా చూస్తామని, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ దానిని నిలబెట్టుకుంటారు అని ఎవరికీ నమ్మకం లేదు. అందుకే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అందరికీ కేబినెట్‌లో సమానంగా అవకాశాలు ఇస్తామని చెప్పిన తాలిబన్లు ఒక్క మహిళకు కుడా అవకాశం కల్పించలేదు. పైగా…