కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్‌లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్‌తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్‌పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్‌లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే…
కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వేగంగా అధికార మార్పిడి జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిని, అభివృద్దిని తీసుకొస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే, 1994 లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలనలోకి వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చారు. కానీ, ఆ వెంటనే అరాచకాలు సృష్టించారు. వారి నాలుగేళ్ల పాలనలో ఆఫ్ఘన్ వాసులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా…
ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆఫ్ఘనిస్తాన్, దానిని ఆక్రమించుకున్న తాలిబన్లపైనే ఉన్నది. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన ఆయుధాలతో పాటుగా, ఎలా పోరాటం చేయాలనే ట్రైనింగ్‌ను ఇచ్చారు. కానీ, అవేమి తాలిబన్ల ముందు పనిచేయలేకపోయాయి. 20 ఏళ్లతో ఆఫ్ఘన్‌లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 2001 నుంచి 2021 వరకు తాలిబన్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉనికిని…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్‌లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే,…
అనుకున్నతం పని అయిపోయింది.. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదశగా కదులుతున్నారు.. దీనిలో భాగంగా తాలిబన్ తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిరాని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్రకటించింది.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టారు తాలిబన్లు.. కేపిటల్ సిటీపై పూర్తిస్థాయిలో…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మూడోంతుల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు తాజాగా మరో నాలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజధాని కాబుల్ కు 80 కిలోమీటర్ల దూరంలో సైనికులకు, తాలిబన్లకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎప్పుడైతే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి తాలిబన్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు.…
తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్నది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్‌లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్‌తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్‌ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు…