జూబ్లీహిల్స్ నియోజకవర్గ బస్తీల్లో వీధులన్నీ ఘుమఘుమలాడిపోతున్నాయ్. అంతా చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై మాటలే వినిపిస్తున్నాయ్. ఇక మందు పార్టీల సంగతైతే సరేసరి.
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు…
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్‌లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ,…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లతో హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి…
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు……
Jagadish Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడెక్కుతున్న వేళ, ప్రచార రంగంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు, గుండాయిజాన్నే నమ్ముకున్నారని, కానీ ప్రజలు ఈ రౌడీయిజాలను, బెదిరింపులను ఎప్పుడూ లెక్కపెట్టరు అని వ్యాఖ్యానించారు. తండ్రి లాగానే కుమారుడూ భయపెడతానంటూ మాట్లాడుతున్నారని, కానీ…
Off The Record: ధూం…ధాం, వాడెవ్వడు వీడెవ్వడు అంటూ… ఆ మధ్య నానా హంగామా చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సడన్‌గా సైలెంట్ అయిపోయారు? ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దానం నాగేందర్ వాయిస్ ఈమధ్య కాలంలో వినిపించకపోవడానికి కారణం ఏంటి? ఓ పెద్దాయన షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి భవిష్యత్ బొమ్మ చూపించారన్నది నిజమేనా? ఎవరా పెద్దాయన? ఏం చెప్పి నోరు మూయించారు? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గడిచిన కొద్ది రోజుల…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుకున్నవే ఉంటాయా? లేక అద్భుతాలు జరుగుతాయా? అత్యంత కీలకమైన ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినా… ఆ ఓట్లు సాలిడ్ అవుతాయా లేదా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియోజకవర్గంలో అసలు మైనార్టీ ఓట్‌బ్యాంక్ టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పట్టులో ఏ మాత్రం తేడా…