జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తేడా కొట్టినట్టు పార్టీ పోస్ట్‌మార్టంలో తేలింది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లోకల్ నాయకులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? వాళ్ళు బాగా హర్ట్ అయ్యారన్నది నిజమేనా? అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్‌ఎస్… సీరియస్ పోస్ట్‌మార్టంలో పడిందట. అసలు గెలుస్తామని, లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన భావించిన పార్టీ పెద్దలు… కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజార్టీ రావడాన్ని అస్సలు…
జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తల్లారా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోగానే కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అని అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని పేర్కొన్నారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని.. కులం, మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ…
Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 5 స్థానాలను గెలుచుకుంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో తన ఉనికిని నిరూపించుకుంది. అయితే, ఈ గెలుపుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం సీమాంచల్ ఓటర్లకు థాంక్స్ చెప్పారు.
KCR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక చర్యలు వేగం పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు, తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై కేసీఆర్ కేటీఆర్‌తో సమీక్షించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్స్ ఫలితాలు పార్టీ అంచనాలను తలకిందులు చేసిన నేపథ్యంలో, స్థానిక నాయకత్వం, క్యాడర్ స్థాయి బలహీనతలు, ప్రచార…
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని…
Vakiti Srihari : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఎన్టీవీతో మాట్లాడుతూ ఈ గెలుపు పూర్తిగా ప్రజలది, ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకునేలా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే…
Jubilee Hills Bypoll Counting : రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠకు తెరపడనుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి…
Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు ఆసక్తికరమైన అంచనాలను వెలువరించాయి. ప్రముఖ సర్వే సంస్థలైన చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్‌పోల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 46 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ 41 శాతంతో కాంగ్రెస్ పార్టీకి…
ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి భారత్ కారణం.. పాక్ ప్రధాని ఆరోపణలు.. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న వానాలోని క్యాడెట్ కాలేజీపై సోమవారం దాడి జరిగింది. ఈ రెండు దాడుల్లో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రెండు దాడులు ‘‘భారత స్పాన్సర్ ఉగ్రవాద ప్రాక్సీ దాడులు’’ అని నిందించారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనలను హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులపై మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్ లపై రెండు కేసులు నమోదు కాగా, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ పై మరో…