Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తమకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం తమదే అని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. మాగంటి…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు