Jubilee Hills By Election Polling: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతున్నప్పటికీ… నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా షేక్‌పేట డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్… శాంతియుతంగా జరుగుతుందనుకుంటే, షేక్‌పేట డివిజన్ లో సీన్ మారిపోయింది.. అక్కడ పోలింగ్ బూత్‌లు 4, 5, 6, 7, 8…
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప…
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) నిదానంగా పోలింగ్ కొనసాగింది.
Polling Delay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌లో అంతరాయం ఏర్పడింది. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఏర్పాట్లను చీఫ్…
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు పాల్గొననున్నారు. సోమవారం రాత్రి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఇక ఎన్నిక సంబంధించి ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపిన వివరాల…
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో నియోజకవర్గం అంతటా నెలకొన్న రాజకీయ సందడికి తెరపడింది. అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు గెలుపు కోసం హోరాహోరీగా కృషి చేశారు. రోడ్డుషోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా…
CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ…
తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంతమంది పోటీలో ఉన్నా ప్రధానంగా…