Telangana: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ..
- మూడు నెలల రేషన్ ఏప్రిల్‌లోనే పంపిణీ..
- తెలంగాణ లబ్ధిదారులకు ఒకేసారి 18 కిలోల చొప్పున సన్నబియ్యం..
- సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాబోయే వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. పేద ప్రజలు ప్రతి నెలా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారంలోనే భానుడి భగభగలు మొదలవ్వడం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ ముందస్తు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో ఉన్న సుమారు ఒక కోటి మూడు లక్షల ఆహార భద్రత కార్డుదారులకు భారీ ఉపశమనం కలగనుంది.
Read Also:Bonus: మాకూ ఇలాంటి బాసే కావాలి.. ఉద్యోగులకు రూ. 240 కోట్ల బోనస్‌ను పంపిణీ చేసిన యజమాని
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున అత్యంత నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇప్పుడు కేంద్రం సూచన మేరకు మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తే.. ఒక్కో వ్యక్తికి ఏకంగా 18 కిలోల సన్నబియ్యం చేతికి అందుతాయి. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి సుమారు 72 కిలోల బియ్యం ఒకే దఫాలో లభిస్తాయి. దీనివల్ల వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి లేదా ఎండల వల్ల బయటకు రాలేని వారికి ఆహార ధాన్యాల కొరత లేకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. అయితే ఈ భారీ మొత్తంలో బియ్యాన్ని పంపిణీ చేసేందుకు అవసరమైన నిల్వలు, రవాణా సౌకర్యాలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం లోతుగా సమీక్షిస్తోంది.
Read Also:Israel: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..
గత ఏడాది వర్షాకాలంలో ఇలాగే మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి ఇచ్చినప్పుడు రేషన్ డీలర్లు , లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా రేషన్ దుకాణాల్లో మూడు నెలల స్టాక్‌ను భద్రపరచడానికి సరిపడా స్థలం లేకపోవడం డీలర్లకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు.. బయోమెట్రిక్ విధానంలో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకోవాలంటే లబ్ధిదారులు ఈ-పోస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తితే ఒక్కో కార్డు పూర్తి కావడానికి 15 నుండి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది దుకాణాల వద్ద రద్దీకి దారితీయవచ్చు. ఈ సాంకేతిక అడ్డంకులను అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడం, హమాలీలకు పని భారం తగ్గడం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఏప్రిల్ నెలలోనే పేద కుటుంబాల ఇళ్లలో బియ్యం నిల్వలు నిండుగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్, పంపిణీ తేదీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా అనుపమ్ ఖేర్!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!