మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుసుకుందేమో. లక్ష ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీష్ రావే చెప్పాలి” అని అన్నారు. అధికారం చేతిలో ఉండగా, ఇష్టానుసారంగా నాళాలను చెరువులుగా మార్చి, కబ్జాలు చేశారు అని ఆయన విమర్శించారు. చిన్న వానే పడితే హైదరాబాద్‌లో సరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, దానికి కారణం ఎవరు అనేది హరీష్…
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్‌లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి…
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పూర్తిగా సన్నాహాలు చేపట్టబడ్డాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,365గా ఉంది, అందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా.. ఇతరులు 25 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ముగ్గురు అబ్జర్వర్స్ పర్యటన చేసి ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈసారి ప్రతి బ్యాలెట్…
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “కాంగ్రెస్ పార్టీ గెలవలేక తప్పుడు ప్రచారానికి దిగింది. నేను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో ఎప్పుడు ఫోటో దిగానో కూడా నాకు తెలియదు. పాత ఫోటోను పోస్ట్ చేసి ‘శ్రీనివాస్ గౌడ్ నవీన్ యాదవ్‌కు మద్దతు’…
Minister Seethakka : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ… నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్‌ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటినీ ప్రక్రియలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, శుక్రవారం 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి…
సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ బతుకు, నీ అయ్య బతుకు…
Jubilee HIlls Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థుల కోసం 321 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 135 సెట్ల నామినేషన్లు (81 మంది అభ్యర్థులవి) అధికారులు ఆమోదించారు. మిగిలిన 186 సెట్ల నామినేషన్లు (130 మంది అభ్యర్థులవి) వివిధ లోపాల కారణంగా తిరస్కరించబడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన అఫిడవిట్‌లో కొన్ని అవసరమైన వివరాలను పేర్కొనలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, రిటర్నింగ్ అధికారి ఆమెను డిక్లరేషన్ సమర్పించాలని…
KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…