Ananth Sri Ram: రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్’తో పుట్టిన ఐరన్ మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కేవలం మెగాస్టార్ వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చరణ్ వ్యక్తిత్వంపై ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సాంగ్ సక్సెస్ ప్రెస్ మీట్‌లో అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, రామ్ చరణ్ పని పట్ల చూపే నిబద్ధతను ఆకాశానికెత్తేశారు. రామ్ చరణ్ పుట్టుకతోనే అన్ని సౌకర్యాలు ఉన్న కుటుంబంలో గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ, కష్టపడే తత్వంలో మాత్రం ఆయన ఒక ‘ఐరన్ మ్యాన్’ అని అనంత్ శ్రీరామ్ అభివర్ణించారు. “ఒళ్లు దాచుకోకుండా పని చేయాలి” అని చిరంజీవి గారు ఎప్పుడూ చెబుతుంటారని, ఆ మాటను అక్షరాలా పాటిస్తూ చరణ్ నిరంతరం శ్రమిస్తుంటారని కొనియాడారు. కేవలం తానొక్కడే బాగుండాలని కాకుండా, తన చుట్టూ ఉన్న వారు, ముఖ్యంగా తనతో పని చేసే సాంకేతిక నిపుణులు కూడా బాగుండాలని కోరుకునే గొప్ప మనసున్న వ్యక్తి చరణ్ అని పేర్కొన్నారు.
Also Read
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న కొత్త ప్రాజెక్టులోని “రయ్ రయ్ రా రా” పాట గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ పాట విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఏది కావాలో, ఆయన విజన్ ఏంటో దానికి తగ్గట్లుగా మీరు సాహిత్యాన్ని రాయండి.. ఆ పాటను అద్భుతంగా పండించడానికి ఎంత కష్టపడటానికైనా నేను సిద్ధం” అని చరణ్ మాటిచ్చారట. చెప్పినట్లుగానే, ఆ పాటలో చరణ్ పర్ఫార్మెన్స్ శివతాండవం ఆడినట్లుగా ఉందని, ఆయన డ్యాన్స్ చూసి యూనిట్ అంతా షాక్ అయ్యారని అనంత్ శ్రీరామ్ తెలిపారు. రచయితగా తనకు దక్కిన ఒక అరుదైన గౌరవం గురించి చెబుతూ అనంత్ శ్రీరామ్ భావోద్వేగానికి లోనయ్యారు. “ఒకే ఏడాదిలో అటు మెగాస్టార్ చిరంజీవి గారితో, ఇటు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గారితో పని చేసే అవకాశం రావడం.. ఇద్దరి సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ అందించి సక్సెస్ అందుకోవడం ఒక రచయితగా నాకు దక్కిన గొప్ప అదృష్టం. చరిత్రలో నేను ఇలాగే నిలిచిపోతాను” అని ధీమా వ్యక్తం చేశారు.
Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!
తాజావార్తలు
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..