జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శక్తిని సమీకరించింది. నవంబర్ 11న జరగనున్న ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు పార్టీ భారీగా ముమ్మర ప్రచారానికి సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్‌ఎస్, ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలనే…
అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారింది.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణం క్యాసినో, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.. టీడీపీ ముఖ్య నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు.. వీరు మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్‌తో పాటు గోవాలో క్యాసినోలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో…
Bandi Sanjay : జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను విమర్శించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “ఏయ్ బిడ్డా… జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా” అంటూ ప్రారంభించిన ఆయన.. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దొందూ దొందే అని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం.
సోమాజిగూడ శ్రీనగర్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా.. మనుషులుగా కలిసి ఉన్నామన్నారు.. బంధుత్వాలు, స్నేహలు ఆంధ్ర, తెలంగాణ మధ్య అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసి ఉండాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందని…
Exit polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. నవంబర్ 6 ఉదయం 7 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధిత సమాచారం, సర్వేలు, లేదా ఫలితాలను న్యూస్ చానెల్స్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించరాదని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి ఆఫర్లే.. ఆఫర్లు.. Hyundai, Tata, Maruti Suzuki, Kia…
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. జూబ్లీహిల్స్‌లో మన గెలుపు ఖాయం, మెజార్టీ తెచ్చుకోవడమే మన చేతుల్లో ఉందని తాజాగా జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు చెప్పాలని.. కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం జరుగుతుందని, రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో…
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్‌లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక…