RRR: గుడ్ న్యూస్ చెప్పిన జీ5.. ఉచితంగా అందుబాటులోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది.
కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ విధానాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీ5 సబ్‌స్క్రైబర్స్‌ని ఈ సినిమాని ఉచితంగా అందించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని.. జీ5 సంస్థ వెనక్కు తగ్గింది. పే-పర్-వ్యూ విధానాన్ని తొలగించి.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి ఆర్ఆర్ఆర్‌ని ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచే వీక్షకులకు ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. జీ5 తీసుకున్న తాజా నిర్ణయంతో, జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. రూ. 699 చెల్లించి ‘RRR ప్లస్ జీ5’ కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ.. మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యే విధంగా అందిచడం జరుగుతుందని జీ5 సంస్థ వెల్లడించింది. మొత్తానికి.. ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. డిజిటల్ వరల్డ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
A good day indeed, as ZEE5 Premium Subscribers can watch the World Digital Premiere for FREE from May 20th
Re-experience the roar, only on 4K Ultra HD!
Note: The best update from the roaring film!World Digital Premiere – ONLY on #ZEE5#RRRonZee5fromMay20
Download ZEE5 app now pic.twitter.com/NO2lYzn4Jk— ZEE5 (@ZEE5India) May 19, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!