మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సీనియర్ నటుడు అజయ్ దేవ్ గన్, ఎన్టీయార్, అలియా భట్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అజయ్ దేవ్ గన్ గురించి జూనియర్ ఎన్టీయార్ తన అభిప్రాయాన్ని చెబుతూ, అభిమానాన్ని చాటుకున్నాడు. అజయ్ దేవ్ గన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అజయ్ దేవ్ గన్ తో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. సింహ, లెజెండ్ చిత్రాల తరువాత వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అంచనాలను మించి నేడు విడుదలైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని కలక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత అఖండ తో థియేటర్లు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇక అఖండ భారీ విజయాన్ని అటు అభిమానులే కాకుండా ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత…
మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.…
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్…
దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు…
2018 అక్టోబర్ లో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ విడుదల అయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చే జనవరిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు జూనియర్. గత మూడేళ్లుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కే పూర్తిగా అంకితమయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తనతో కలసి నటించిన రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు సమాంతరంగా ‘ఆచార్య’ పూర్తి చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వేరే ఏ సినిమా చేయలేదు. మూడేళ్ళకు పైగా వచ్చిన గ్యాప్ ని వచ్చే ఏడాది 2022లో ఫిల్…
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాటనే. ప్రస్తుతం ఈ పాట యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. కీరవాణి నాటు కంపోజిషన్ కంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్స్ అందరినీ ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను పేరడీ చేస్తూ పలు జంటలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అసలు ఈ డ్యాన్స్ నంబర్ కోసం చరణ్, తారక్ ఎలా ప్రిపేర్ అయిఉంటారనేది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ మొత్తానికీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వచ్చిన పాట కావడం, పైగా ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపి, భారీ అంచనాలను నమోదు చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఓ భారీ భవంతి ముందు,…