Kanmani: ఆ విషయంలో కమల్ హాసన్ తర్వాత తారకే పర్ఫెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూ. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘జై లవ కుశ’లో తాను చెప్పిన ‘ఘట్టమేదైనా, పాత్రేదైనా’ అన్నట్టు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. ఇతని నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప.. ఎక్కడా ఫేక్ కనిపించదు. ఈతరం హీరోల్లో నవరసాల్ని పండింగల హీరో ఎవరైనా ఉన్నారంటే, అది తారక్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ.. దర్శకధీరుడు రాజమౌళి లాంటోడే తన ఫేవరేట్ హీరో అని తారక్ చెప్పాడంటే, అతడు ఎంత విలక్షణ నటుడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో దర్శకుడు.. తారక్‌పై పొగడ్తల వర్షం కురిపించడం, కమల్ హాసన్ తర్వాత అతడే పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని పేర్కొనడం టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది
ఆ దర్శకుడి పేరు కన్మణి. ఈయన నా ఊపిరి, చిన్నోడు, బీరువా వంటి సినిమాలను తీశాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇప్పుడు హీరోల్లో పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎవరనే ప్రశ్న కన్మణికి ఎదురవ్వగా.. ఏమాత్రం మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు తారక్ అని చెప్పేశాడు. ‘‘నాకు వ్యక్తిగతంగా తారక్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి, ఇప్పుడున్న హీరోల్లో కమల్ హాసన్ తర్వాత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే, అది తారకే అని చెప్తాను. ఎందుకంటే, క్లోజప్ షాట్‌లో ఏ స్టార్ హీరో కూడా ఏడ్వడానికి ఇష్టపడరు. కానీ.. కమల్, ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. మిగతా హీరోలు క్లోజప్ షాట్స్‌లో ఏడ్వడానికి ట్రై చేసినా, అందులో ఒరిజినాలిటీ కనిపించదు. కానీ.. అదే సీన్ ఎన్టీఆర్ – కమల్ చేస్తే, సోల్ కనిపిస్తుంది’’ అంటూ కన్మణి చెప్పుకొచ్చాడు.
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
ఇదే సమయంలో.. ఆర్ఆర్ఆర్‌లో తారక్ ప్రదర్శించిన గొప్ప పెర్ఫార్మెన్స్ గురించి కన్మణి మాట్లాడాడు. ‘కొమరం భీముడో’ పాటలో తారక్ పలికిన హావభావాలు, పండించిన ఎమోషన్స్.. అతని ప్రతిభకు తార్కాణం అన్నాడు. ఎమోషనల్ కంటెంట్ విషయంలో తారక్ ‘ఆర్ఆర్ఆర్’కు సోల్‌గా నిలిచాడని తెలిపాడు. ఇలా తారక్‌పై కన్మణి చేసిన పొగడ్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముఖ్యంగా, తారక్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుష్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్‌ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్‌ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!