జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా కార్యరూపం దాల్చుకోనున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తారక్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే, తారక్‌ని ప్రశాంత్ నీల్ సరికొత్త గెటప్‌లో ప్రెజెంట్ చేశాడు. కోర మీసంతో రౌద్రం లుక్‌లో తారక్ అదరహో అనిపించాడు. ఈ పోస్టర్‌లో తారక్ ముఖాన్ని సగమే చూపించారు. అందులోనే తారక్ పలికిన రౌద్రం, చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్‌ని బట్టి చూస్తుంటే, తారక్‌తోనూ ప్రశాంత్ నీల్ ఓ పవర్ఫుల్ సినిమా చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది.
ఈ సందర్బంగా ప్రశాంత్ నీల్ పోస్టర్‌ని షేర్ చేస్తూ.. ‘‘రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, ఈ నేలే ఆయన వారసత్వం, రక్తం కాదు’’ అనే ఓ పవర్ఫుల్ డైలాగ్‌ని కూడా రివీల్ చేశారు. అలాగే స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ కథ ఆలోచన తనకు 20 ఏళ్ళ క్రితమే మెదిలిందని, అయితే ఈ కథ స్థాయి, పరిమాణం భారీగా ఉండటంతో ఇంతకాలం వెనక్కు తగ్గానని అన్నారు. ఎట్టకేలకు ఇన్నేళ్ళ తర్వాత తన కలల ప్రాజెక్ట్‌ని తన డ్రీమ్ హీరోతో తెరకెక్కిస్తున్నానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఈ పోస్టర్‌ని కూడా ప్రశాంత్ నీల్ బ్లాక్ & వైట్‌లోనే రిలీజ్ చేయడం గమనార్హం. అయితే, టైటిల్ మాత్రం వెల్లడించలేదు.
ఈ పోస్టర్ రిలీజైన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉన్నాయి. కాగా.. తారక్ బర్త్ డేను పురస్కరించుకొని నిన్న కొరటాల శివను అనౌన్స్ చేసిన సంగతి విదితమే! ఈ సినిమాని కూడా యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమా పోస్టర్లను షేర్ చేస్తూ.. తారక్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు.
And then with @prashanth_neel pic.twitter.com/cUBWeSoxfW
— Jr NTR (@tarak9999) May 20, 2022