NTR31: తెర వెనుక ఇంత కథ నడిచిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూ. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఉందన్న విషయం అందరికీ తెలుసు! ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తుందో కూడా క్లారిటీ లేదు. అయితే.. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా పనుల్ని మాత్రం తారక్ అప్పుడే మొదలుపెట్టేశాడని సమాచారం. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. తారక్ పాత్రకి సంబంధించిన లుక్ టెస్ట్‌ని ప్రశాంత్ నీల్ రీసెంట్‌గానే నిర్వహించాడట! తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకే ఈ లుక్ టెస్ట్ జరిపారట!
నిజానికి.. NTR31 ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. తారక్ ఇటు కొరటాల శివ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలి, ప్రశాంత్ అటు సలార్ షూటింగ్ ముగించుకోవాల్సి ఉంటుంది. తమతమ పనులు ముగించుకొని ఆ ఇద్దరు ఫ్రీ అవ్వడానికి, కనీసం ఈ ఏడాది చివరివరకూ సమయం పడుతుంది. అయినప్పటికీ, కేవలం ఫ్యాన్స్‌ని సంతృప్తిపరచడం కోసమే, ప్రత్యేకంగా ఈ లుక్ టెస్ట్ నిర్వహించారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే, ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని కూడా ఇప్పటినుంచే మొదలుపెట్టనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎక్కువ సమయం వృధా చేయకుండా, త్వరగా పనులు కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
ఆల్రెడీ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తోనే తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఆ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోవడంతో, ప్రశాంత్ ఇప్పుడు జాతీయంగా మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుడిగా అవతరించాడు. ఈ నేపథ్యంలోనే అతని తదుపరి చిత్రాలపై క్రేజ్ వచ్చిపడింది. ముఖ్యంగా.. NTR31 మీదే అందరి దృష్టి ఉంది. అటు, ఆర్ఆర్ఆర్‌తోనూ తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు కాబట్టే, వీరి కాంబోలో రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పట్నుంచే బజ్ ఏర్పడింది.
తాజావార్తలు
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!