Kalyan Ram Gives Clarity On Political Entry: జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. మీడియా తారస పడినప్పుడల్లా, వీళ్లద్దరికి పాలిటిక్స్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రస్తుతం తమ దృష్టంతా సినిమాల మీదే ఉందని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా.. ‘క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారు?’ అనే ప్రశ్న మాత్రం ఆ ఇద్దరికీ తరచూ ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ‘బింబిసార’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్‌కి మరోసారి పొలిటికల్ ప్రశ్న ఎదురైంది. అయితే.. ఈసారి కళ్యాణ్ కాస్త భిన్నంగా సమాధానం ఇచ్చాడు.
‘‘మనం ఒకేసారి రెండు పడవలలో ప్రయాణం చేయలేం. ప్రస్తుతం నా ఫోకస్ సినిమాల మీదే ఉంది. ఒకవేళ నేను రాజకీయాల్లో అడుగుపెడితే, అప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా’’ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ రామ్ ఇప్పుడిప్పుడే ట్రాక్‌లోకి వస్తున్నాడు. హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ లెక్కన, ఇతను పాలిటిక్స్‌లో అడుగుపెట్టడానికి చాలా సమయమే పడుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక తారక్ విషయంలోనూ సేమ్ సీనే! తన కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది కాబట్టి, రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు. ఒకవేళ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తే.. 20 సంవత్సరాల పైనే అవుతుందంటూ చెప్పాడు.
కాగా.. పటాస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోని కళ్యాణ్ రామ్, బింబిసార మీదే చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనని ట్రాక్‌లోకి తీసుకొస్తుందని చాలా నమ్మకంగానూ ఉన్నాడు. ఇందులో బింబిసార రాజుగా నటిస్తున్న కళ్యాణ్ సరసన కేథరిన్ తెరిసా, సంయుక్త మేనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. అటు, తారక్ విషయానికొస్తే.. కొరటాల శివతో తన తదుపరి సినిమాని ఇంకా ప్రారంభించాల్సి ఉంది.