ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా- నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక అవుతోంది. తాజాగా ఈ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా స్పందించారు. అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.
Read Also: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. దర్యాప్తుకు సహకరిస్తా..
యువత రాజకీయాల్లోకి రావాలని అమిత్ షా ఎప్పుడూ కోరుకుంటారు. భవిష్యత్ రాజకీయ పరిణామాల్లో జరగబోయే మార్పులకు ఈ భేటీ నాందీ పలికింది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు.. ఆయనకు రాజకీయ చైతన్యం ఉంది. జూనియర్ అత్తమ్మ పురంధేశ్వరీ బీజేపీలోనే ఉన్నారు. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీతో తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నాం.ఏపీకి చెందిన కొందరు వైసీపీ నేతలు తమంతట తామే ముందుకొచ్చి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదని చెప్పుకుంటున్నారు.
బీజేపీ అవినీతిపరులను దగ్గరకు రానీయదు. అవినీతిపరులు బీజేపీలో చేరి గంగలో మునిగి పునీతలవుదామని భావిస్తే.. అది కుదరని పని.ఏపీలో బీజేపీ బలపడకూడదని ఢిల్లీ పెద్దలతో సన్నిహితంగా ఉన్నామని వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నారు.పేదల సొమ్మును దోచే ప్రభుత్వం ఏపీలో ఉంది. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలతో కూడుకున్న ప్రభుత్వమిది. ఏపీలో గంజాయి.. డ్రగ్స్ లేవా..? మంత్రి అమర్నాధ్ మహా నటుడు. దావోస్ వెళ్లిన అమర్నాధ్ ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా..?
ఏపీని నట్టేట ముంచిన వైసీపీ.. బీజేపీని విమర్శిస్తారా..? గతంలో ఉన్న పరిశ్రమలకు పెయింట్ కొట్టి కొత్త పరిశ్రమలు తెచ్చామని చెబుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చి ఉంటే.. విజయసాయి పెట్టిన జాబ్ మేళాకు అంత మంది నిరుద్యోగులెందుకు వస్తారు..?ప్రధానిని ఏపీ సీఎం జగనే కాదు.. కమ్యూనిస్టు సీఎం కూడా కలుస్తారు.వైసిపి ఢిల్లీలో మాట్లాడింది ఎపి లో ప్రజలు నమ్మవద్దు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే సిఎం ఢిల్లీ టూర్. తెలంగాణా పరిస్ధితి లే ఎపిలో ఉత్పన్నమవబోతున్నాయి. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో తెలంగాణాలో ఎమ్మెల్సీ కవిత ఉందని బిజెపి ఎంపి చెప్పారు
ఇప్పటిదాకా కెసిఆర్, కెటిఆర్, కవిత స్పందించలేదు. లిక్కర్ స్కాంలో ఎపి కి చెందిన వారు ఉన్నారు.. ఆయా పార్టీలు ముందుకు వచ్చి చెప్పాలి మా పార్టీలో ఎవరూ లేరని లిక్కర్ స్కాంలో ఉన్నవారు బయటకు రావాలి..లేకపోతే విచారణ సంస్ధలే బయటకు తెస్తాయి. లిక్కర్ స్కాంలోని వారిని బిజెపి రక్షించదు.. చట్టం తన పని చేసుకుపోతుందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.